YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో, గుంటూరు పోలీసులు కారు డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రమణారెడ్డిని A1గా, జగన్‌ను A2గా, కారు యజమానిని A3గా చేర్చాలని పోలీసులు నిర్ణయించారు.
YS Jagan Case
సింగయ్య మరణించిన రోజే పోలీసులు ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే, సీసీ కెమెరా దృశ్యాల్లో ఇది జగన్ (YS Jagan) ప్రయాణిస్తున్న కారు అని నిర్ధారణ కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్‌లో అదనంగా ఐపీసీ 304(II) సెక్షన్‌ను కూడా చేర్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ స్మృతి (బీఎన్‌ఎస్) చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే సూచనలున్నాయి.
ఎఫ్ఐఆర్‌లో సెక్షన్లు మార్పు చేసి, కోర్టుకు మెమో పంపాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై దీనిపై చర్చించారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న సాక్షులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే అప్పట్లో బందోబస్తులో ఉన్న పోలీస్ సిబ్బందిని కూడా విచారణ కోసం పిలిపిస్తున్నారు.
Also Read : Israel PM Sensational : ఇరాన్ అణుస్తావరాల దాడులపై ట్రంప్ ను ప్రశంసించిన నెతన్యాహు















