CM Chandrababu : అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సంచలన ప్రకటించారు. డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, వారి ఆస్తులను జప్తు చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. ప్రజా పోలీసింగ్ తో గంజాయి, డ్రగ్స్ రహిత రాష్టంగా ఏపీని మార్చాలని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయిలపై ఫిర్యాదులకు వాట్సప్ నెంబరు 8977781972, టోల్ ఫ్రీ నెంబరు 1972 కు ఫిర్యాదు చేయాలని కోరారు సీఎం. డ్రగ్స్ పై యుద్దం ప్రకటిస్తున్నామని, ఎవరైనా దీనికి మద్దతు ఇస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు.
CM Chandrababu Shocking Decision
నషా ముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిస చేసి సమాజాన్ని పీడిస్తున్న మాఫియాను తరిమేద్దామని పిలుపునిచ్చారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంతో పోటీ పడాల్సి ఉందన్నారు. ఈ తరహా సమస్యలు పెరిగితే ఇబ్బందులు వస్తాయన్నారు. గంజాయి రవాణ, సాగు చేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాని చెప్పారు.
సాగుచేసినా, బయట నుంచి తీసుకువచ్చి విక్రయించినా సహించేది లేదన్నారు.. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపామని చెప్పారు. ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. టెక్నాలజీతో డ్రోన్లు వినియోగించి నేర నియంత్రణ చేస్తున్నామన్నారు, సీసీటీవీ కెమెరాలతో నేరాలు జరక్కుండా చూస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు గుర్తు చేశారు.
Also Read : YS Sharmila Shocking Comments : యోగా సరే విభజన హామీలపై మాటేంటి..?















