Minister Parthasarathy : విశాఖపట్నం – సింహాచలం లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారిని శనివారం దర్శించుకున్నారు మంత్రి కొలుసు పార్థసారథి (Minister Parthasarathy). పూర్ణ కుంభంతో మంత్రి కి స్వాగతం పలికారు వేద పండితులు .దర్శనం అనంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలతో పాటు చిత్ర పటాన్ని అందించారు. దర్శనం అనంతరం కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు.
Minister Parthasarathy Visit
అప్పన్న స్వామిని అధికారికంగా దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతమన్నారు. తన జీవితంలో మరిచి పోలేని స్వామి అని పేర్కొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా సేవలు అందుకుంటున్నాడని, ఎందరో భక్తులు ఆయనకు ఉన్నారని చెప్పారు. తమ కూటమి ప్రభుత్వం ఏపీని ఆధ్యాత్మిక ప్రాంతంగా మారుస్తోందన్నారు. అంతే కాకుండా పర్యాటక రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు కొలుసు పార్థసారథి.
ఆలయాల అభివృద్ది కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఆలయాలను పట్టించు కోలేదని ఆరోపించారు. జగన్ రెడ్డి పూర్తిగా అన్ని వ్యవస్థలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశాడని మంఇపడ్డారు.
Also Read : Journalist Swetcha Death : జర్నలిస్ట్ స్వేచ్చ సూసైడ్ వెనుక పూర్ణ చందర్ రావు















