Housing Board Assets : హైదరాబాద్ – తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ కు చెందిన ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున కంచె గచ్చిబౌలి లోని విలువైన భూములను అమ్మేందుకు ప్లాన్ చేయగా ఆదిలోనే బెడిసి కొట్టింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అంతే కాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏకి పారేసింది. పర్యావరణంకు ముప్పు ఏర్పడితే అక్కడనే జైలు ఏర్పాటు చేసి శిక్షించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి సైలెంట్ అయ్యింది సర్కార్.
Housing Board Assets Sale
తాజాగా ప్రభుత్వ ఆస్తుల వేలానికి సిద్దమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని పలు హౌసింగ్ బోర్డు (Housing Board Assets) ఆస్తులను వేలం వేసి రూ.539 కోట్ల ఆదాయం పొందాలని నిర్ణయించింది. కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4 పరిధిలోని సర్వే నం.1009 లో ఉన్న 7.33 ఎకరాల వేలంతో దాదాపు రూ.392 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేస్తోంది.ఫేజ్-4 పరిధిలో ఉన్న 4598, 2420 చదరపు గజాల రెండు ప్లాట్ల వేలంతో రూ.73 కోట్లు రావొచ్చని అంచనా వేస్తోంది.
ఎస్ఆర్ నగర్లోని కమ్యూనిటీ హాల్ వేలంతో రూ.53 కోట్లు, నాంపల్లిలోని 1148 చదరపు గజాల ఖాళీ స్థలం వేలంతో రూ.23 కోట్ల ఆదాయం రావొచ్చని ప్లాన్ చేసింది. ఇటీవల కేపీహెచ్బీ ఫేజ్-7 లోని 18 ప్లాట్లు, చింతల్, నిజాంపేట్ పరిధిలోని ఖాళీ స్థలాలను వేలం వేసిన విషయం విదితమే.
Also Read : ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ















