Ustaad Bhagat Singh : డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తను దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో కీలక పాత్రలు పోషించారు పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం అద్భుతంగా అందించాడు. ప్రధానంగా దర్శకుడు రాసిన సంభాషణలు దుమ్ము రేపాయి. బుల్లెట్ల కంటే ఎక్కువగా ఆకట్టుకునేలా చేశాయి. ఇప్పటికీ తను రాసిన డైలాగులు ప్రేక్షకుల నాలుకల మీద రిపీట్ అవుతూనే ఉన్నాయి.
Chiranjeevi in Ustaad Bhagat Singh
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) పై కీలక అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ తో చిత్రీకరణ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ప్రత్యక్షం అయ్యారు తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి. అందరినీ ఆశ్చర్య పరిచారు. ప్రస్తుతం కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు దర్శకుడు హరీశ్ శంకర్.
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత తను పవన్ కళ్యాణ్ తో తీస్తున్న రెండో చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా పవర్ స్టార్ నటించిన సినిమాలు హరి హర వీరమల్లు, ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పవర్ స్టార్ సరసన లవ్లీ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. సాక్షి వైద్య, గౌతమి, అశుతోష్ రానా, టెంపర్ వంశీ, అవినాష్ పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Popular Bonalu Festival 2025 : అసలు బోనాల పండగ విశిష్టత ఏంటో తెలుసా..















