Trinadha Rao Nakkina : యంగ్ హీరో హవీష్ మరియు విజయవంతమైన దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ‘నువ్విలా’, ‘జీనియస్’, ‘రామ్ లీలా’, ‘సెవెన్’ వంటి సినిమాలతో హవీష్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే విధంగా ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘ధమాకా’, ‘మజాక’ వంటి హిట్ చిత్రాలతో త్రినాథరావు నక్కిన టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా నిలిచాడు.
Trinadha Rao Nakkina – Havish Movie
ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న తాజా సినిమా నిఖిల్ కోనేరు నిర్మాణంలో రూపొందుతోంది. చిత్రయూనిట్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తైంది.
ఇక జూన్ 19న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు నిర్మాత నిఖిల్ కోనేరు ప్రకటించారు. సంగీత దర్శకుడిగా మ్యూజిక్ మాస్ట్రో మిక్కీ జే మేయర్ వ్యవహరిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిజార్ షఫీ చేపట్టారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది.
Also Read : Hero Arya – IT Raids : తమిళ హీరో ‘ఆర్య’ ఇంట్లో ఐటీ సోదాలు















