Actress Kalpika : సినీనటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఇదివరకే ఒక కేసులో ఆమె పేరు ఉల్లేఖించబడగా, ఇప్పుడు బాధితురాలైన కీర్తన చేసిన తాజా ఫిర్యాదు ఆధారంగా ఇది రెండో కేసుగా నమోదైంది. ఈసారి 67 ITA 2000-2008 సెక్షన్, 79, 356 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Actress Kalpika Got New Case
బాధితురాలైన కీర్తన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో – ఇన్‌స్టాగ్రామ్‌లో తనను అసభ్యకరమైన పదజాలంతో కల్పిక(Actress Kalpika) గణేష్ బహిరంగంగా ధూషించిందని, అలాగే ఇన్‌బాక్స్‌లో కూడా వ్యక్తిగతంగా మెసేజ్‌ల ద్వారా తీవ్రంగా వేధించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, తనపై పెట్టిన అభ్యంతరకరమైన స్టేటస్‌ల స్క్రీన్‌షాట్‌లు, మెసేజ్‌లను ఆధారాలుగా సైబర్ క్రైమ్ అధికారులకు సమర్పించినట్టు తెలిపింది.
కేవలం సోషల్ మీడియా వేదికగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోను తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసేలా కల్పిక ప్రవర్తించిందని బాధితురాలు ఆరోపించింది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇదే నేపథ్యంలో కల్పిక గణేష్‌పై రెండోసారి కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తి ఆధారాలన్నింటినీ పరిశీలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు, అవసరమైతే కల్పిక గణేష్‌ను విచారణకు పిలిచే అవకాశముంది. ఈ కేసు త్వరలోనే మలుపులు తిరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికావచ్చని సమాచారం.
Also Read : CM Chandrababu- Hero Meeting : ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న సినిమా ప్రముఖులు















