Air India Stop : ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన సర్వీసును రద్దు చేసిన ‘ఎయిర్ ఇండియా’

విమానం బయలుదేరే ముందు నిర్వహించిన ప్రీ-ఫ్లైట్ తనిఖీలో ఈ లోపం గుర్తించబడినట్టు అధికారులు తెలిపారు...

Hello Telugu - Air India Stop

Hello Telugu - Air India Stop

Air India : ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు మరోసారి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయి. మంగళవారం ఢిల్లీ నుంచి పారిస్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (Air India) AI-143 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు ఆ సేవను రద్దు చేశారు. విమానం బయలుదేరే ముందు నిర్వహించిన ప్రీ-ఫ్లైట్ తనిఖీలో ఈ లోపం గుర్తించబడినట్టు అధికారులు తెలిపారు.

Air India Stop

సాంకేతిక నిపుణులు లోపాన్ని పరిష్కరించే పనిలో ఉండగా, పారిస్ CDG అంతర్జాతీయ విమానాశ్రయంలో అర్ధరాత్రి సమయంలో విధించిన ఆంక్షల కారణంగా సేవను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేకపోయిందని వెల్లడించారు. ఈ కారణంగా జూన్ 18న పారిస్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన రిటర్న్ ఫ్లైట్ AI-142 కూడా రద్దయింది.

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల ఎయిర్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారికి త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది. టిక్కెట్ డబ్బు రీఫండ్ చేయడం, రీషెడ్యూల్‌కు అవకాశం కల్పించడం, హోటల్ వసతులు కూడా అందించనున్నట్టు వివరించారు.

ఇంతకుముందు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లోనూ సాంకేతిక లోపం తలెత్తి, అదే విధంగా విమాన సేవను నిలిపివేయాల్సి వచ్చింది.

Also Read : PC Ghose Commission Sensational : కాళేశ్వరం కమిషన్ విచారణలో వెలుగులోకి సంచలన అంశాలు

Exit mobile version