Allari Naresh : అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. పూర్తిగా హీరోగా, కమెడియన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంతే కాదు దర్శకుడు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించిన గమ్యం మూవీలో కీ రోల్ పోషించాడు. ఇప్పటి వరకు నరేష్ అల్లరోడుగా అలరిస్తూ వచ్చినా ఈ చిత్రంలో మాత్రం తను సీరియస్ హీరోగా గుర్తింపు పొందాడు. గతంలో పూర్తిగా హాస్య ప్రధాన మూవీస్ లో నటించి మెప్పించాడు.
Allari Naresh Movie Updates
తాజాగా అల్లరి నరేష్ (Allari Naresh) కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తను కొత్తగా రంభ ఊర్వశి మేనక చిత్రంలో నటించనున్నాడు. నాంది సినిమాతో సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాడు తను. ఇప్పటికే మారేడుపల్లి ప్రజానీకం, ఉగ్రం, నా సామి రంగ, ఆ ఒక్కటి అడక్కు, బచ్చలమల్లి లాంటి సినిమాలలో డిఫరెంట్ రోల్స్ పోషించాడు నరేష్. ఎవరూ ఊహించలేదు తనలో ఇంత టాలెంట్ దాగి ఉందని. తను సీరియస్ గా స్టోరీలతో పాటు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటున్నాడు.
త్వరలోనే రంభ ఊర్వశి మేనక చిత్రంలో నటించనున్నాడు. ఇదిలా ఉండగా నటుడు శర్వానంద్ తో రాధ మూవీ తీసిన చంద్రమోహన్ నరేష్ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అల్లరోడు 12ఏ రైల్వే కాలనీ మూవీ లో నటిస్తున్నారు. దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి కావచ్చిందని సమాచారం. ఇది పూర్తయ్యాక కొత్త మూవీ షూటింగ్ కు రెడీ అవుతాడు.
Also Read : Manju Pathrose Shocking Decision : చావు అంచుల నుంచి తిరిగొచ్చిన నటి – మంజు పాథ్రోస్ జీవిత సందేశం















