Amit Shah : పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యల్లో భాగంగా, సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని మళ్లీ కొనసాగించే అవకాశముందా అనే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టత ఇచ్చారు.
Amit Shah Shocking Comments on Indus Water Treaty
‘‘సింధూ ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించేది లేదు,’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేము ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయలేదు. కానీ పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంతో చట్టబద్ధంగా తాత్కాలికంగా నిలిపివేశాం,’’ అని పేర్కొన్నారు.
1960లో జరిగిన ఈ ఒప్పందం పరస్పర శాంతి, సహకారానికి ప్రతీకగా రూపొందించబడిందని, కానీ పాకిస్థాన్ ఒప్పంద ఉల్లంఘనల వల్ల దానికి తాము విలువ ఇవ్వలేకపోతున్నామని తెలిపారు.
నీటి వినియోగంపై స్పష్టత
భారతదేశానికి చట్టబద్ధంగా దక్కిన నీటిని పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతానికి నీటిని మళ్లించేలా కెనాల్ నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడిపై అమిత్ షా వ్యాఖ్యలు
ఏప్రిల్ 21న కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) టూరిస్టు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జరిగిందని అమిత్ షా పేర్కొన్నారు. ఇది కేవలం కశ్మీర్‌కే కాక దేశమంతటా బాధ కలిగించిన ఘటన అని చెప్పారు.
ప్రధానమంత్రి మోదీ ఆదేశాల ప్రకారం భారత సైన్యం కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే లక్ష్యదాడులు చేపట్టిందని వివరించారు. పౌరులపై ఎలాంటి దాడులు జరగలేదని, భారత్ ఎప్పుడూ శాంతికి పెద్దపీట వేస్తుందన్న విషయాన్ని ఇక్కడ మరోసారి ప్రూవ్ చేశామని తెలిపారు.
కాంగ్రెస్ విమర్శలపై కౌంటర్
కాంగ్రెస్ ఉగ్రదాడులపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన అమిత్ షా, ‘‘వాళ్లు తమ హయాంలో ఒక మంత్రిని మార్చడమే తప్ప ఇతర ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు విమర్శించే నైతిక హక్కు వారికి లేదు,’’ అంటూ గట్టిగా స్పందించారు.
Also Read : CM Nitish Kumar Shocking : ఎన్నికల ముందు బీహార్ ప్రజలకు పెన్షన్ 400 నుంచి 1100 పెంచిన సర్కార్

















