Anushka Shetty : వరుస ఫ్లాప్‌లతో నిరాశలో ఉన్న అనుష్క శెట్టి, తన తాజా సినిమా ‘ఘాటీ’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గతంలో లేడీ ఓరియంటెడ్ హిట్ సినిమాల్లో ఫాలో అయిన విజయవంతమైన ఫార్ములానే ఇప్పుడు మళ్లీ ప్రయోగిస్తున్నారు.
Anushka Shetty Movie Updates
క్రిష్ దర్శకత్వంలో అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఎక్కువగా యాక్షన్, హింసకు సంబంధించిన శైలీ చూపించారు మేకర్స్. దీంతో సినిమా మొత్తం ఇదే జోన్‌లో సాగుతుందన్న భావన ప్రేక్షకుల్లో నెలకొంది.
అయితే, తాజాగా విడుదలైన అప్డేట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాలో జాతర నేపథ్యంలో వచ్చే ఒక డ్యూయెట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీన్ని బట్టి సినిమాలో లవ్ ట్రాక్కూ విశేష ప్రాధాన్యత ఉన్నట్టు స్పష్టం అయింది.
ఇంతకుముందు ‘భాగమతి’ సినిమా కోసం కూడా అనుష్క ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఆ సినిమాలో ఆమె భయపెట్టే పాత్రతో పాటు, ‘మందార మందార’ వంటి మెలోడి సాంగ్‌లో ప్రేమ కోణాన్ని కూడా చూపించారు.
ఇప్పుడు ‘ఘాటీ’ సినిమాతో అదే ఫార్ములా మళ్లీ పని చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అనుష్క (స్వీటీ) టీం. ఈసారి అనుష్క మళ్లీ భారీ హిట్ కొడతారేమో చూడాలి!
Also Read : Drishyam 3 Sensational : ఒకేసారి మూడు భాషల్లో అలరించనున్న ‘దృశ్యం 3’















