MLC Madhav : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై నెలలుగా కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్‌ను పార్టీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. మంగళవారం (జూలై 1, 2025) విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
MLC Madhav As a AP BJP Chief
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్ (MLC Madhav) గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆయన రాజకీయ అనుభవంతో పాటు, ఆరెస్సెస్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం కూడా అధ్యక్ష పదవికి కీలకంగా మారినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మాధవ్ కుటుంబానికి బీజేపీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన తండ్రి చలపతిరావు 1986–88 మధ్య కాలంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ ఆవిర్భావ దశలో నుంచే కుటుంబం పాత్ర బలంగా ఉండటం కూడా మాధవ్ ఎదుగుదలకు సహకరించింది.
వివాదాల నుంచి దూరంగా ఉంటూ, పార్టీ గళాన్ని స్పష్టంగా వినిపించే నేతగా మాధవ్‌కు గుర్తింపు ఉంది. పార్టీకి స్వతంత్ర బలాన్ని పెంచడం, కూటమి భాగస్వాములతో సమన్వయం కొనసాగించడం వంటి కీలక బాధ్యతలు ఆయనను ఎదుర్కొననున్నాయి.
తన నియామకంపై అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం, పీవీఎన్ మాధవ్ మంగళవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆయన తీసుకునే చర్యలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.
Also Read : AP Liquor Scam Sensational : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన అప్డేట్















