CM Chandrababu : అమరావతి – ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినాయకత్వం మొదలుకుని పార్టీ కార్యకర్త వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ను నెల రోజులు చేపట్టేలా టీడీపీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. దీనికి సన్నాహాక సమావేశంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరిశీలకులతో సదస్సు నిర్వహించారు.
CM Chandrababu Comments
ఈ సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దిశా నిర్దేశం చేశారు. ఏడాది కాలంగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేలా అమలు చేస్తున్న కుట్రలను కూడా ప్రజలకు వివరించాలని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తామని ఎన్నికల ముందు తాను, పవన్ కళ్యాణ్ మాటిచ్చామన్నారు. ప్రజలు నమ్మి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాన్ని కట్టబెట్టారని స్పష్టం చేశారు. నమ్మి ఆదరించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
ప్రజల్లోకి నామోషీ లేకుండా వెళ్లి ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించాలన్నారు. చేసిన పనులు చెప్పడంతో పాటు.. అమలు కాని పనులు ఎందుకు అవ్వలేదో చెప్పాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే వారు అంత ఆదరిస్తారు. పనిచేయడం ఒక ఎత్తు…జనానికి అందుబాటులో ఉండటం మరొకఎత్తు అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు దౌర్జన్యాలు చేసినా ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారని కొనియాడారు. నిర్మొహమాటకుండా వ్యవహరించి గెలుపే ధ్యేయంగా అభ్యర్థులను ఎంపిక చేశామని గుర్తు చేశారు.
Also Read : Nara Lokesh Interesting : ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు















