CM Chandrababu : అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నిప్పులు చెరిగారు. తన స్వంత పార్టీకి చెందిన సమావేశం జరుగుతుంటే హాజరు కావాల్సిన ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలా పార్టీ రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు.
CM Chandrababu Strong Warning to MLA’s
ఆదివారం జరిగిన కీలకమైన విస్తృత స్థాయికి రాక పోవడం మీకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుస్తుందన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు. పార్టీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ రావును ఆరా తీశారు. ఏమైనా ఎవరైనా రాని వారు నీకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తరచూ విదేశీ టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారని, ఇలాగైతే నెట్టుకు రావడం కష్టమన్నారు సీఎం.
ఫారిన్ ట్రిప్పులు వేసే బదులు, రాజకీయాలు మానుకుని ఫారిన్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చురకలు అంటించారు. సమావేశాలు ఉన్నప్పుడే దైవ దర్శనాలు పెట్టుకోవాలా? మరో రోజు పెట్టుకోవచ్చు కదా అని అసహనం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. గైర్హాజర్ అయిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది.
Also Read : నితిన్ రెడ్డి తమ్ముడు మూవీ రిలీజ్ కు రెడీ















