AP High Court : జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ బీ. రాణిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో, సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులపై తాము పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, వారు కేసు నమోదు చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
AP High Court Shocking Comments
ఈ సందర్భంగా రాష్ట్ర అటార్నీ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఈ వ్యాజ్యం విచారణార్హత కలిగినదేఅని తాను భావించడం లేదని కోర్టుకు తెలియజేశారు. పోలీసులపై చర్య తీసుకోవాలంటే, మొదట మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయాల్సిందిగా సూచించారు. ఇలా చేయకుండా నేరుగా హైకోర్టును (AP High Court) ఆశ్రయించడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, సాక్షి మీడియా కార్యాలయాలపై జరిగిన దాడులను నిరోధించడంలో పోలీసులు సహా సంబంధిత అధికారులు తమ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని ఆరోపించారు. ఈ దాడుల వల్ల సంస్థకు జరిగిన ఆస్తి నష్టం పట్ల ప్రభుత్వాన్ని బాధ్యులుగా గుర్తించి, నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశించాల్సిందిగా కోర్టును కోరారు.
ఈ వాదనలు ఆమూలంగా పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్, ప్రతివాదులు తమ కౌంటర్ అఫిడవిట్‌ను పూర్తి వివరాలతో దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేశారు.
Also Read : Amit Shah Shocking Comments : భారతీయ భాషలతోనే దేశ సంస్కృతిని, అభివృద్ధిని కాపాడగలం















