AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు బాలాజీ, నవీన్‌లను ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఆదివారం ఇండోర్‌లో అదుపులోకి తీసుకుంది.
AP Liquor Scam Sensational Updates
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి రాష్ట్ర సరిహద్దులోకి సుమారు రూ.8.2 కోట్లు తీసుకువచ్చినట్టు బాలాజీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదు అప్పట్లోనే ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్నది. నగదు ప్రాతినిధ్యం వ్యవహారంపై విచారణ కొనసాగుతుండగా, బాలాజీ, నవీన్ ఇద్దరూ రాష్ట్రం వెలుపల వెళ్లిపోయారు.
వీరిద్దరూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తలదాచుకున్నట్లు అనుమానించిన సిట్, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి నివాసాన్ని గుర్తించి, అటు నుంచి జరుగుతున్న కాల్స్‌ను ట్రాక్ చేసింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్లిన సిట్ బృందం వారిని అదుపులోకి తీసుకుంది.
గతంలో బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పట్లో బాలాజీ వారి అదుపులో లేడని, తాము అరెస్ట్ చేయలేదని సిట్ స్పష్టం చేసింది.
ఈనేపథ్యంలో బాలాజీ, నవీన్ కోసం సిట్ నిరంతరం గాలింపు చర్యలు చేపట్టి చివరకు వారిని ఇండోర్‌లో పట్టుకోవడం కేసులో కీలక మలుపుగా మారింది. విచారణ మరింత వేగం పట్టే అవకాశముంది.
Also Read : Supreme Court Shocking – Lalit Modi : ఐపీఎల్ మాజీ ఛైర్మన్ ‘లలిత్ మోదీకి’ సుప్రీంకోర్టులో చుక్కెదురు















