Avika Gor : టాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చింది. వరుసగా హీరో హీరోయిన్లు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. రీసెంట్ గా అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాగా… ఇప్పుడు మరో బ్యూటీ పెళ్లి బాటపట్టేందుకు రెడీ అవుతోంది. తన క్యూట్ లుక్స్ తో తెలుగు ఆడియెన్స్ ను ఉయ్యాల జంపాల ఆడించిన అవికాగోర్(Avika Gor) త్వరలో పెళ్లి చేసుకోనుంది. రీసెంట్ గా ప్రియుడితో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Avika Gor Marriage
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగునాట తెగ పాపులార్ అయింది అవికా(Avika Gor). ఆ తర్వాత వెండితెరపై తన మెరుపులు మెరిపించింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది. తాజాగా 27 ఏళ్ల ఈ చిన్నది.. ఎంగేజ్‌మెంట్ చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘రోడీస్ రియల్ హీరోస్’ టీవీ షో కంటెస్టెంట్ మిలింద్ చంద్వానీ తో కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. ఐదేళ్లుగా రిలేషన్ లో ఈ జోడి… తాజాగా ఉంగరాలు మార్చుకుంది. అవికా లేత పింక్ కలర్ శారీలో అందంగా కనిపించింది. అంతేకాక కాబోయే వాడి చెంపపై ముద్దు పెడుతూ సంతోషంగా కనిపించిందీ చిన్నది. ఈ క్యూట్ పెయిర్ కు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
అవికా గోర్ విషయానికి వస్తే… ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ , ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. తన దగ్గరకు వచ్చిన సినిమాలను చేసుకుంటుపోతున్న టైంలో… టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరోతో గొడవతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి సన్నగా మారి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా మారి ‘పాప్‌కార్న్’ అనే మూవీ చేసింది. రీసెంట్ గా ‘షణ్ముఖ’ సినిమాలో నటించిన ఈ చిన్నది ఎంగేజ్ మెంట్ చేసుకుని… త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. మ్యారేజ్ డేట్ త్వరలో రివీల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read : Producer K Mahendra Death : టాలీవుడ్ అగ్ర నిర్మాత కే మహీంద్రా ఇకలేరు

















