CM Chandrababu : చిత్తూరు జిల్లా – సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రాండ్ కుప్పం ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రకటించారు. గతంలో బ్రాండ్ కుప్పం అనేది లేదన్నారు. ఇప్పుడు ఆ దిశగా కుప్పంలో తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని చెప్పారు. కుప్పంలో ఎయిర్ పోర్టు రాబోతోందని ప్రకటించారు సీఎం. రూ. 850 కోట్లతో ఎయిర్ పోర్టు కోసం ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. విమానాశ్రయానికి భూములివ్వొద్దని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
CM Chandrababu Announced New Airport in Kuppam
ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతల మాటలు వినవద్దని కోరారు. ఎయిర్ పోర్టుకు భూమి ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని భరోసా ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు వారంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు సీఎం.
కుప్పంలో ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానల్ అనేది ఉండాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. పెట్టుకోక పోతే వెంట పడి పెట్టిస్తానని అన్నారు. ఇళ్లపై రూఫ్ టాప్ ద్వారా మనమే సొంతగా విద్యుత్ తయారు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే పీఎం సూర్యఘర్ పధకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీలకు రాయితీ కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తామన్నారు.
సూర్యఘర్ పథకాన్ని పూర్తిగా వినియోగించుకుంటే కరెంటు కోతల పరిస్థితి ఉండదన్నారు. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఇక రాదన్నారు. కుప్పంలో ఏసీల అవసరం ఉండదు కానీ.. అవసరమైతే ఏసీలకు సోలార్ విద్యుత్ పెట్టుకోవచ్చని తెలిపారు సీఎం. ఇళ్లకే కాదు వ్యవసాయానికి సోలార్ విద్యుత్ వినియోగించు కవాలని పిలుపునిచ్చారు.
Also Read : Tirumala Revenue Growth : వేసవి అనంతరం అమాంతంగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం















