CM Revanth Reddy Shocking Comments : తెలంగాణకు మరణశాసనం రాసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Shocking Comments

Hello Telugu - CM Revanth Reddy Shocking Comments

CM Revanth Reddy : హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. త‌ను తెలంగాణ పేరుతో నిట్ట నిలువునా ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌ని, అరాచ‌క పాల‌న సాగించాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రైతు నేస్తం కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. కాళేశ్వ‌రం పేరుతో మిగ‌తా ప్రాజెక్టుల‌ను ఎండ బెట్టాడంటూ మండిప‌డ్డారు. వ్యవసాయం మీద కేవలం కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించారంటూ ఆవేద‌న చెందారు.

CM Revanth Reddy Shocking Comments on KCR

రూ. 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కం , రూ. 300 కోట్ల‌తో పూర్తి కావాల్సిన బీమా, రూ. 200 కోట్ల‌తో నిర్మించాల్సిన నెట్టెంపాడు, రూ. 6 వేల కోట్ల‌తో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు, రూ. 3 వేల కోట్ల‌తో పూర్తి కావాల్సిన దేవాదుల ప్రాజెక్టుల‌ను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ద‌మ్ముంటే గోదావ‌రి బ‌న‌చ‌ర్ల ప్రాజెక్టు మీద చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు కేసీఆర్ కు . ఎదురెదురుగా స్పీక‌ర్ ముందు తాడో పేడో తేల్చుకుందామ‌న్నారు సీఎం.

ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయిస్తే..తెలంగాణకు 299 టీఎంసీల కోసం చంద్రబాబు దగ్గర వొంగివొంగి దండాలు పెట్టి సంత‌కాలు చేయించుకున్న‌ది నువ్వు కాదా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌ ఉచిత, బోడి, దిక్కుమాలిన సలహాలు, సూచనలు అవ‌స‌రం లేద‌న్నారు. గోదావరి నుంచి 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయన్న కేసీఆర్ సూచన మేరకే 2016లో ఆ జ‌లాల‌ను బనకచర్లకు తరలించడానికి చంద్రబాబు జీవో ఇచ్చారని చెప్పారు.

Also Read : పొగాకు రైతుల ఖాతాల్లోకి 273 కోట్ల నగదు జ‌మ

Exit mobile version