Rahul Gandhi : ఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అమేథీ ఎంపీ, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని రావాలంటూ ఆహ్వానం పలికింది. గత కొంత కాలంగా మహారాష్ట్రలో జరిగిన శాసన సభ ఎన్నికలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు నెలకొన్నాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది ఈసీ. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఎలా తాము ఓడి పోయామో ఆయన ఆధారాలతో సహా బయట పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది ఈసీ.
Rahul Gandhi Got Invitation from EC
ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు , అనుమానాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను మరాఠాలో నిర్వహించడం జరిగిందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా పూర్తి వివరాలను వెల్లడించేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొంది. ఇందుకు సంబంధించి తాము ఎప్పుడైనా తమ కార్యాలయానికి రావచ్చని సూచించింది. తాజాగా ఈసీ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఇదిలా ఉండగా పోల్ ప్యానెల్ నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ ఇటీవల ఓ పత్రికలో ప్రత్యేకంగా కథనం రాశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఈసీఐ కార్యదర్శి అశ్వనీ కుమార్ రాహుల్ గాంధీకి సుదీర్ఘ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ లేవదీసే ప్రతి ప్రశ్నకు సమాధానం తమ వద్ద ఉందని స్పష్టం చేసింది ఈసీ.
Also Read : గౌతం అదానీ భార్య భావోద్వేగం
