EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025లో ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు మెరుగైన ఆర్థిక భద్రత కల్పించడమే.
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే – ఈ బీమా కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.
EPFO – EDLI పథక వివరాలు:
ఈ పథకం 1976లో ప్రారంభమైంది. ఉద్యోగి సేవలో ఉన్న సమయంలో మరణిస్తే, ఆయన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడటం ఈ పథకం లక్ష్యం. ఉద్యోగి తరఫున యజమాని ప్రాథమిక జీతానికి 0.5% బీమా ఖర్చుగా చెల్లిస్తాడు. ఉద్యోగి నుండి ఎలాంటి డబ్బు తీసుకోవడంలేదు.
గతంలో ఈ పథకం ద్వారా గరిష్ఠ బీమా కవర్ రూ.2.5 లక్షలు మాత్రమే ఉండేది. తాజాగా దాన్ని రూ.7 లక్షల వరకూ పెంచారు.
2025లో తీసుకున్న మూడు ముఖ్యమైన మార్పులు:
బీమా పరిమితి పెంపు: గరిష్ఠ బీమా కవర్‌ను రూ.7 లక్షలకి పెంచారు. గత 12 నెలల ఉద్యోగి సగటు జీతం ఆధారంగా ఈ మొత్తం నిర్ణయిస్తారు.
కొత్త ఉద్యోగులకు ప్రయోజనం: సర్వీస్ కాలం ఒక సంవత్సరం కంటే తక్కువ ఉన్న ఉద్యోగికీ కనీసం రూ.50,000 బీమా లభిస్తుంది. ముందు ఇది లభించేది కాదు.
ఉద్యోగ మార్పులో కవరేజ్ కొనసాగింపు: ఉద్యోగాలు మారినపుడు, రెండు ఉద్యోగాల మధ్య గరిష్ఠంగా రెండు నెలల గ్యాప్ ఉంటే, బీమా కవర్ కొనసాగుతుంది.
క్లెయిమ్ ఎలా చేయాలి?
ఉద్యోగి మరణించిన తర్వాత, ఆయన నామినీ లేదా చట్టపరమైన వారసులు EPFO ప్రాంతీయ కార్యాలయంలో క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించాలి. యజమాని సహాయం తీసుకోవచ్చు.
EPFO ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు 1,000 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగానే మరణిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఈ పథకం వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది.
ముఖ్యాంశాలు:
ఉద్యోగి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు
రూ. 7 లక్షల వరకూ బీమా కవర్
కొత్త ఉద్యోగులకు కూడా ప్రొటెక్షన్
క్లెయిమ్ ప్రక్రియ సులభం
ఇది భారతదేశ కార్మికులకు గొప్ప భద్రతను కల్పించే ఉచిత బీమా పథకం
ఈ మార్పులతో EDLI స్కీమ్ ఒక సామాజిక భద్రతా చొరవగా, భారత ఉద్యోగుల కోసం మరింత ఉపయోగకరంగా మారింది.
Also Read : Air India Stop : ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన సర్వీసును రద్దు చేసిన ‘ఎయిర్ ఇండియా’















