Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణంగా ఆయన బేగంపేటలోని సన్ షైన్ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Harish Rao Health Problems
కేటీఆర్‌పై ఏసీబీ విచారణ నేపథ్యలో, హరీష్ రావు (Harish Rao) సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యంలో అస్వస్థత వచ్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కేటీఆర్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు మాట్లాడుతూ – ‘‘కేటీఆర్ ఒక్క వ్యక్తి కాదు, ఒక శక్తి. రేవంత్ రెడ్డి దృష్టి మళ్లించే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ, కేటీఆర్‌పై సహా బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అనవసర కేసులు పెడుతున్నాడు. ఇప్పుడు తుమ్మినా, దగ్గినా కేసు పెడుతున్న రోజులు వచ్చాయి. ఇది చిల్లర రాజకీయాలకే నిదర్శనం’’ అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
Also Read : Perni Nani Shocking : మాజీ మంత్రి పేర్ని నాని పై భగ్గుమన్న మచిలీపట్నం కోర్టు

















