Helicopter Crash : ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మిగిలిన బాధను మర్చిపోకముందే, మరో దుర్ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఆదివారం (జూన్ 16) నాడు ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) గౌరికుండ్ మరియు త్రిజుగి నారాయణ్ మధ్య ఆర్యన్ కంపెనీకి చెందిన ఒక హెలికాప్టర్ హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Helicopter Crash in Uttarakhand
ఈ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి పవిత్ర యాత్ర స్థలమైన కేదార్‌నాథ్ వైపు వెళ్తుండగా, మౌస్‌లిక వాతావరణ పరిస్థితుల కారణంగా మధ్యలోనే అదుపు తప్పి కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా రానుంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితుల కోసం తీవ్రంగా గాలింపు, సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాద స్థలాన్ని పర్యవేక్షిస్తున్న వారు హెలికాప్టర్ అవశేషాలను గుర్తించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
పవిత్ర యాత్ర సమయంలో జరిగిన ఈ ప్రమాదం యాత్రికుల హృదయాల్లో భయాన్ని కలిగించడంతో, ప్రభుత్వ యంత్రాంగం భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచనలు వెలువడుతున్నాయి.
Also Read : Anirudh Love Marriage : కావ్య మారన్ తో పెళ్లిపై ఇలా స్పందించిన అనిరుద్

















