Jana Nayagan : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “జన నాయగన్” నుంచి అభిమానులను ఉర్రూతలూగించే అప్డేట్ వచ్చింది. ఆదివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా నుంచి రోరింగ్ లుక్ వీడియో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దీంతో తమిళ సినీ వర్గాల్లో మరియు విజయ్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Hero Vijay – Jana Nayagan 1st Look
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో అజిత్‌తో “తునీవు”, “వాలిమై” చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంగీత దర్శకుడిగా యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ పని చేస్తున్నారు.
ఈ సినిమా విజయ్ (Vijay) కెరీర్లో 69వ చిత్రం కావడంతో పాటు, రాజకీయ ఎంట్రీకి ముందు ఆయన చివరి చిత్రంగా భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. “జన నాయకన్” పేరుతో తమిళంలో విడుదలవ్వనున్న ఈ చిత్రాన్ని, తెలుగులో “జన జన నాయకుడు” పేరుతో సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” కి రీమేక్ అనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అయితే దీనిపై మేకర్స్ స్పష్టంగా చెప్పారు. కానీ తాజాగా విడుదలైన లుక్, వీడియోలు మాత్రం “భగవంత్ కేసరి” చిత్రాన్ని తలపించేలా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ పోలికలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఫ్యాన్స్ ఇద్దరి వీడియోలను పక్కపక్కనే పెట్టి వైరల్ చేస్తున్నారు.
చివరిగా, విజయ్ నటనతో పాటు దర్శకుడు వినోద్ కంటెంపరరీ సోషల్ ఎలిమెంట్స్‌ని ఎలా మిళితం చేస్తారన్నదే ఈ సినిమా ప్రత్యేకతగా మారనుంది. సంక్రాంతికి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా “జన నాయకుడు”తో విజయ్ మ్యాజిక్‌ను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Also Read : Manchu Vishnu- Hero Prabhas : డార్లింగ్ ప్రభాస్ వెనుక కర్ణుడిలా ఉండిపోతా..















