YS Jagan : అమరావతి – మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సమయంలో తనతో పాటు తన తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఆనాటి పార్టీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ కొత్తవాళ్లే, మాపై ప్రేమ, అభిమానం ఉన్న వాళ్లు నాతో వచ్చారన్నారు. ఆనాటి నుంచే నా ప్రస్తానం మొదలైందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీపడ లేదన్నారు.
YS Jagan Comments
మంగళవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు, కీలక నేతలు, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తను పార్టీ పెట్టిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు, ఆరోపణలు, విమర్శల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు వైఎస్ జగన్ రెడ్డి (YS jagan).
ఆనాడు ప్రజలు తనను ఆశీర్వదించారని, అక్కున చేర్చుకున్నారని, దేశంలోనే ఎక్కడా లేని రీతిలో విజయాన్ని కట్టబెట్టారని, ఆ తర్వాత అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేలా చేశానని, కానీ కూటమి నేతలు ఇచ్చిన హామీల మాయలో పడి తమను 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. మళ్లీ పాదయాత్ర చేస్తానని, ప్రజలను కలుస్తానని, సోషల్ మీడియా కార్యకర్తలతో ముచ్చటిస్తానని చెప్పారు జగన్ రెడ్డి.
Also Read : వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
