Indian Weapons Growth : ఆయుధాల తయారీలో రోజురోజుకు పెరుగుతున్న భారత్ మార్క్

ఈ శక్తివంతమైన ఫైటర్‌కు కొనసాగింపుగా HAL ప్రస్తుతం ‘తేజస్‌ మార్క్‌ 2’ అనే మరింత ఆధునిక వర్షన్‌పై పని చేస్తోంది...

Hello Telugu - Indian Weapons Growth

Hello Telugu - Indian Weapons Growth

Indian Weapons : భారతదేశంలో హైదరాబాద్‌, పూణే, జబల్పూర్‌, బెంగళూరు, నాగ్‌పూర్‌, కొచ్చి వంటి నగరాలు ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాకుండా ఆధునిక ఆయుధాల ఉత్పత్తికి కేంద్ర బిందువులుగా ఎదుగుతున్నాయి. ఈ నగరాల్లో డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO), హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL), భారత్‌ (India) ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) వంటి ప్రభుత్వ రక్షణ సంస్థలు మరియు పలు ప్రైవేట్ కంపెనీలు ఆయుధాల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

Indian Weapons Growth Viral

ఇటీవలి కాలంలో బెంగళూరులో HAL రూపొందించిన ‘తేజస్‌’ ఫైటర్‌ జెట్‌ భారత (India) వైమానిక దళంలో చేరింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధ విమానం, సూపర్‌సోనిక్‌ వేగం, స్మార్ట్‌ రాడార్‌ వ్యవస్థలు, క్షిపణి లాంచర్‌లు వంటి ఆధునిక ఫీచర్లతో నిర్మించబడింది. ఈ శక్తివంతమైన ఫైటర్‌కు కొనసాగింపుగా HAL ప్రస్తుతం ‘తేజస్‌ మార్క్‌ 2’ అనే మరింత ఆధునిక వర్షన్‌పై పని చేస్తోంది.

తమిళనాడులోని అవడిలో తయారైన అర్జున్‌ ట్యాంక్‌, పాకిస్తాన్‌కు చెందిన ట్యాంకులతో పోలిస్తే యుద్ధంలో మెరుగైనదిగా గుర్తింపు పొందింది. జబల్పూర్‌లోని గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ రూపొందించిన ‘ధనుష్‌’ ఫిరంగిని ‘స్వదేశీ బోఫోర్స్‌’గా పిలుస్తున్నారు. ఇది ఇప్పటికే భారత సైన్యంలో సేవలు అందిస్తోంది.

హైదరాబాద్‌లో, DRDO మరియు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) కలిసి ఆకాశ్‌ మరియు నాగ్‌ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు. ఆకాశ్‌ క్షిపణులు గగనతల రక్షణ కోసం రూపొందించగా, నాగ్‌ క్షిపణులు యాంటీ-ట్యాంక్‌ దాడుల కోసం రూపొందించారు. మొదట రష్యాతో కలసి తయారు చేసిన బ్రహ్మోస్‌ క్షిపణులు ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి అవుతున్నాయి, ఇది భారత రక్షణంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు.

కొచ్చిలో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌకగా చరిత్ర సృష్టించింది. అదేవిధంగా, విశాఖపట్నంలో అభివృద్ధి చేసిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌, పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇది సముద్రాల్లో భారత బలాన్ని ప్రదర్శించేందుకు ఒక కీలక సాధనం.

చివరిగా, చండీగఢ్‌ మరియు కాన్పూర్‌లోని ఆయుధ కర్మాగారాల్లో ఇప్పుడు INSAS రైఫిళ్లు, AK-203, కార్బైన్‌లు వంటి చిన్నపాటి ఆయుధాల తయారీ జరుగుతోంది. దేశీయ స్థాయిలో ఆయుధాల తయారీ పెరుగుతోందంటే, అది భారతదేశం ఆత్మనిర్భర్ డిఫెన్స్‌ వ్యవస్థ దిశగా తీసుకుంటున్న బలమైన అడుగులనిచూపిస్తోంది. భవిష్యత్తులో భారతదేశం ఒక సమగ్ర రక్షణ శక్తిగా మారుతుందన్న నమ్మకాన్ని ఈ అభివృద్ధి బలపరుస్తోంది.

Also Read : Gold Rates Today : మధ్యప్రాచ్యంలో అలజడులు నేపథ్యంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Exit mobile version