Phone Tapping Sensational : 4013 మంది ప్ర‌ముఖుల ఫోన్లు ట్యాపింగ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు

Hello Telugu - Phone Tapping Sensational

Hello Telugu - Phone Tapping Sensational

Phone Tapping : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్య‌వ‌హారం రోజు రోజుకు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. తాజాగా సిట్ జ‌రిపిన విచార‌ణ‌లో 2023 న‌వంబ‌ర్ 15 నుంచి 30 వ‌ర‌కు భారీగా ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు సీఐబీ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. మొత్తం 4013 ఫోన్ నెంబ‌ర్ల‌ను ప్ర‌ణీత్ రావు అండ్ టీం ట్యాపింగ్ చేసిన‌ట్లు గుర్తించారు. వీరిలో 618 మంది రాజ‌కీయ నేత‌ల ఫోన్ నెంబ‌ర్లు ఉన్నాయి. వీరిలో అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామిక‌వేత్త‌లు, ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టులు, సినీ న‌టుల నంబ‌ర్లు కూడా ఉన్నాయి.

Phone Tapping Sensational Updates

ఇదిలా ఉండ‌గా సిట్ ముందుకు విచార‌ణ‌కు హాజ‌రైన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆనాటి సీఎం కేసీఆర్ క‌నుస‌న్న‌ల‌లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం జ‌రిగింద‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డి, త‌న స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, బండి సంజ‌య్, ఆయ‌న ఫ్యామిలీ, ఈటెల , త‌న ఫ్యామిలీ, మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో పాటు కుటుంబీకులు, అనుచ‌రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన‌ట్లు గుర్తించారు సిట్ అధికారులు.

ఇక విచార‌ణ‌లో భాగంగా త్వ‌ర‌లోనే ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మైనం పల్లి హనుమంత్ రావు, KS రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే లు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్య లకు నోటీసులు ఇవ్వ‌నుంది సిట్. ఇక ఐఏఎస్ లు రోనాల్డ్ రాస్, గౌతం ల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసిన‌ట్లు గుర్తించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 228 మంది నుంచి వాంగ్మూలం సేక‌రించారు.

Also Read : TG High Court Warning :స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టు సీరియ‌స్

Exit mobile version