Konda Murali Shocking Comments : నేను రౌడీని ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను – కొండా

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మంత్రి భ‌ర్త

Hello Telugu - Konda Murali Shocking Comments

Hello Telugu - Konda Murali Shocking Comments

Konda Murali : వ‌రంగ‌ల్ జిల్లా – మంత్రి కొండా సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రౌడీన‌ని ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని, తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డే ర‌కం కాద‌న్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కొంద‌రు త‌న‌ను టార్గెట్ చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌నంటే ఏమిటో ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. తాను 500 ఎక‌రాల పెత్తందారుడిన‌ని, మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో 15 ఎక‌రాలు అమ్మి ఏకంగా రూ. 70 కోట్లు ఖ‌ర్చు చేశాన‌ని అన్నారు.

Konda Murali Shocking Comments

త‌నకు ఎవ‌రి పైస‌లు అవ‌స‌రం లేద‌న్నారు కొండా ముర‌ళి (Konda Murali). నేను ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. త‌న రాజ‌కీయ పోరాటం అంతా ఉన్న‌త వ‌ర్గాల‌తోనేని, సామాన్యుల‌తో కాద‌న్నారు . త‌న భార్య కొండా సురేఖ‌ను ఐదుసార్లు ఎమ్మెల్యేగా ద‌గ్గ‌రుండి గెలిపించుకున్నా. అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాలే చేశాన‌ని, ఇది త‌న వ‌ల్ల‌నే జ‌రిగింద‌న్నారు కొండా ముర‌ళి.

డీసీసీబీ బ్యాంక్ కష్టాల్లో ఉన్నప్పుడు నాకు భాద్యతలు అప్పగించాడు ఆనాటి సీఎం దివంగ‌త వైఎస్ఆర్. రూ. 13 కోట్లు ఇచ్చాడ‌ని తెలిపారు. గత ఎంఎల్‌సి ఎన్నికల్లో నేను నామినేషన్ వేస్తే ఏ పార్టి నుండి కూడా ఒక్క నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేద‌న్నారు. నేను ఒక రౌడినీ అయినా నామీద జనాల ప్రేమ ఉందన్నారు. అంటే నా మంచితనమే నా రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు కార‌ణం అవుతోంద‌న్నారు. మ‌రోసారి బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : బీజేపీ అధ్య‌క్షుడిగా రాంచందర్ రావు

Exit mobile version