Lord Puri Jagannath Interesting Facts : పూరి జగన్నాథుని విగ్రహానికి అంత స్టోరీ ఉందా..

ఈ గాధ ప్రకారం, శ్రీకృష్ణ పరమాత్ముని అవతారాంతంలో ఒక అద్భుతమైన ఘటన జరిగినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

Hello Telugu - Lord Puri Jagannath Interesting Facts

Hello Telugu - Lord Puri Jagannath Interesting Facts

Puri Jagannath : పూరి, ఓడిషా : పూరి జగన్నాథ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా భావించబడుతుంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన జగన్నాథుడు, సుభద్రా, బాలభద్రుల విగ్రహాలలోని “బ్రహ్మ పదార్థం” వెనక ఓ ప్రాచీన గాధ దాగి ఉంది. ఈ గాధ ప్రకారం, శ్రీకృష్ణ (Lord Sri Krishna) పరమాత్ముని అవతారాంతంలో ఒక అద్భుతమైన ఘటన జరిగినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

Puri Jagannath – జర బాణం – శాస్వత హృదయం

శ్రీకృష్ణుడు అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, ఆయన కాళ్ళను జింకగా భావించిన బోయివాడు ‘జర’ పొరబాటుగా బాణాన్ని సంధిస్తాడు. అది కృష్ణుని హృదయానికి తగలడంతో ఆయన తీవ్ర గాయమవుతాడు. జర చేసిన తప్పును క్షమించిన శ్రీకృష్ణుడు (Lord Sri Krishna), ఇది పూర్వజన్మ రుణమేనని తెలిపతాడు. అర్జునుడు అక్కడికి చేరుకుని, కృష్ణుని ఆదేశాల మేరకు ఆయన దేహానికి దహనక్రియ నిర్వహిస్తాడు.

అయితే కృష్ణుని (Lord Sri Krishna) శరీరం పూర్తిగా బూడిదగా మారినా, ఆయన హృదయం మాత్రం అద్భుతంగా దహనానికి గురికాకుండా నీలివర్ణ మణిలా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ హృదయాన్ని ‘బ్రహ్మ పదార్థం’గా పిలుస్తారు. ఆ హృదయాన్ని సముద్రంలో వదిలేయాలని అర్జునికి ఆదేశిస్తాడు కృష్ణుడు.

విశ్వభసు – ఆటవికుల రాజు

ఆ హృదయం సముద్రాన్ని దాటి, పూరి తీరాలకు చేరుతుంది. అక్కడ వేటాడుతూ ఉన్న విశ్వభసు అనే ఆటవికుడు (జరుని పునర్జన్మ) దానిని కని, అత్యంత గోప్యంగా ఒక గుహలో భద్రపరిచి రోజూ పూజలు చేస్తూ ఉంటాడు. ఇతని కూతురు పూర్వజన్మలో కృష్ణుని వనిత అనే నమ్మకం ఉంది.

ఇంద్రద్యుమ్నుడు – ఆగమబద్ధ ప్రతిష్ఠకు సంకల్పం

ఈ సమయంలో ఒడిశాలోని పాలకుడు ఇంద్రద్యుమ్నుడు జగన్నాథుని విగ్రహాలను ప్రతిష్ఠించాలన్న తపనతో ఉంటాడు. కానీ తగిన బ్రహ్మ పదార్థం లేకపోవడంతో బాధపడతాడు. అనంతరం విశ్వభసు వద్ద ఉన్న ఈ పవిత్ర పదార్థం గురించి తెలుసుకుని, తన అనుచరుడిని పంపించి విషయం ఆరా తీస్తాడు.

విశ్వభసు కూతురిని వివాహం చేసుకున్న ఆ అనుచరుడు గుహలోని బ్రహ్మ పదార్థాన్ని చూసి రాజుకు సమాచారం ఇస్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు సైన్యంతో బయలుదేరి విశ్వభసును కలుస్తాడు. కానీ గుహ వద్దకు వెళ్లినపుడు బ్రహ్మ పదార్థం కనిపించదు. అది కేవలం విశ్వభసుకే దర్శనమిస్తుందని తాను ప్రత్యక్షమై శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు.

బ్రహ్మ పదార్థం ఆలయానికి చేరిక

శ్రీకృష్ణుని అనుగ్రహంతో విశ్వభసు, ఆ బ్రహ్మ పదార్థాన్ని ఇంద్రద్యుమ్నుని ద్వారా ఆలయానికి చేర్చుతాడు. ఆ విధంగా పూరిలో జగన్నాథ ఆలయంలోని విగ్రహాల కేంద్రంలో స్థిరపడుతుంది.

నవకళేవరం – పరంపరలో పవిత్ర మార్పు

ప్రతి 12 లేదా 13 సంవత్సరాలకోసారి జరిగే నవకళేవర ఉత్సవంలో జగన్నాథుడి పాత విగ్రహాలను తొలగించి, కొత్తవాటిని ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుడు, కళ్ళకు గంతలు కట్టి, ఒంటికి పట్టువస్త్రాలు చుట్టుకుని గర్భగృహంలోకి ప్రవేశించి, పాత విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో ప్రతిష్ఠిస్తాడు. ఇది అత్యంత రహస్యంగా, సంప్రదాయబద్ధంగా జరిగే ఆధ్యాత్మిక ఘట్టం.

ఈ విధంగా, శ్రీకృష్ణుని హృదయం రూపంలో ప్రారంభమైన బ్రహ్మ పదార్థం, జగన్నాథుని రూపంలో పూరిలో స్థిరపడడం – భారతీయ సంస్కృతిలో ఓ మహత్తర సాంస్కృతిక విశేషంగా నిలిచిపోయింది.

Also Read : Delhi Bonalu Interesting : ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు

Exit mobile version