Marco Rubio : అమెరికా చేసిన అణు స్థావరాలపై దాడులకు ప్రతీకారంగా, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ఘాటు హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు కీలకమైన ఈ జలమార్గం మూయబడితే అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఆర్థిక ప్రకంపనలు కలగనుండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.
Marco Rubio Shocking Comments
ఈ నేపథ్యంలో ఇరాన్‌ను శాంతికి ఒప్పించేందుకు అమెరికా చైనాను ఆశ్రయించింది. దీనిని అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ మార్కో రూబియో (Marco Rubio) ఓ టీవీ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. “హార్ముజ్ జలసంధి ప్రపంచ ముడి చమురు సరఫరాకు కీలకం. ఇరాన్ ఆ మార్గాన్ని మూసేస్తే ఆత్మహత్యతో సమానమని వాళ్లకు అర్థం కావాలి. ప్రపంచం మొత్తానికి ఇది ముప్పుగా మారుతుంది. చైనా, ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలి” అని ఆయన అన్నారు.
మరోవైపు, ఇరాన్ హెచ్చరికలను అమెరికా చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. “అమెరికాకు ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే దీని ప్రభావం అమెరికా కంటే మిగతా దేశాలపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బెదిరింపులను ప్రపంచం అంతా ఆచితూచి చూడాలి” అని రూబియో సూచించారు.
అదే సమయంలో చైనా కూడా అమెరికా వైమానిక దాడులపై ఘాటుగా స్పందించింది. “ఇది మరో మిలిటరీ తప్పిదం. 2003 ఇరాక్ యుద్ధం సమయంలో జరిగిన దానినే మళ్లీ పునరావృతం చేస్తున్నారు. మిలిటరీ మార్గం కాకుండా దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలి” అని చైనా వాఖ్యానించింది.
ప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి భాగస్వామ్యం సుమారు 20 శాతం. ఈ మార్గం మూయబడితే ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని తాకే అవకాశముందని, ఆర్థిక వ్యవస్థలు దోలే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఎటు దారి తీస్తుందో తెలియక, అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.
Also Read : Sajjala Ramakrishna Reddy Shocking : వైసీపీ కీలక నేత సజ్జలపై తాడేపల్లి స్టేషన్ లో క్రిమినల్ కేసు















