MG Cars Company Shocking : ఎంజీ కార్లను ప్రేమించే వాళ్ళకి సంచల వార్త

మోడల్ మరియు వేరియంట్ ఆధారంగా ధరల పెంపు వర్తిస్తుందని వెల్లడించింది...

Hello Telugu - MG Cars Company Shocking

Hello Telugu - MG Cars Company Shocking

MG Cars : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా (MG Cars ), జూలై 1, 2025 నుంచి తన కార్ల ధరలను సుమారు 1.5 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన ఎంజీ మోటార్, మోడల్ మరియు వేరియంట్ ఆధారంగా ధరల పెంపు వర్తిస్తుందని వెల్లడించింది.

MG Cars Company Shocking

కంపెనీ పేర్కొన్నదానిపై ప్రకారం, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, ఆర్థిక ఒత్తిడులు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. కామెట్ ఈవీ (ధర: రూ. 4.99 లక్షలు)తో ఈ పెంపు ప్రారంభమవనుంది. ఆ తర్వాతి మోడల్ విండ్సర్ ఈవీ, దీని ధర సుమారు రూ. 10 లక్షలు. ఇక ఐసీఈ మోడళ్లలో ఆస్టర్ (రూ. 11.30 లక్షలు), హెక్టర్ (రూ. 17.5 లక్షలు) అలాగే గ్లోస్టర్ టాప్ వేరియంట్ ధర రూ. 41.07 లక్షలు వద్ద ఉంది.

ఎలక్ట్రిక్ మోడళ్లకు “బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్” ఎంపిక

ఎంజీ తన ఎలక్ట్రిక్ కార్లకు వినూత్నంగా బ్యాటరీ లేకుండా కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. వినియోగదారులు కారును బ్యాటరీ లేని మోడల్‌గా కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఖర్చులను తగ్గించేందుకు ఉపయుక్తంగా ఉండనుంది.

లగ్జరీ విభాగంలోకి ఎంట్రీ – కొత్త మోడళ్లతో రెడీ

భారత మార్కెట్లో లగ్జరీ కార్ల విభాగంలోకి ప్రవేశించేందుకు ఎంజీ మోటార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఎం9 లిమోజిన్ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది చివరిలో, స్టైల్ మరియు అధిక పనితీరును కలబోసిన సైబర్‌స్టర్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు మార్కెట్‌లోకి రానుంది.

ఈ లగ్జరీ మోడళ్లను “ఎంజీ సెలెక్ట్” అనే ప్రత్యేక డీలర్‌షిప్ బ్యానర్‌ ద్వారా అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకమైన, వ్యక్తిగతీకరించిన అనుభవం అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ కొత్త అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తోంది.

అంతేకాదు, ప్రస్తుతం ఉన్న గ్లోస్టర్ ఆధారంగా రూపొందించిన “మెజెస్టర్” అనే లగ్జరీ ఎస్‌యూవీ మోడల్‌ను కంపెనీ త్వరలో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం. ఇది ఎంజీ ఇండియన్ లైనప్‌లో కొత్తగా చేరనుంది.

Also Read : Today Gold and Silver Price : మరోసారి స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

Exit mobile version