Minister Atchannaidu : అమరావతి – రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పొగాకు పండించిన రైతులు నష్ట పోకుండా తొలిసారిగా మార్క్ ఫెడ్ ద్వారా సర్కారే దగ్గరుండి కొనుగోలు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన మొత్తం డబ్బులను ఆయా రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Minister Atchannaidu Comments
తమది ముమ్మాటికీ రైతుల ప్రభుత్వమని అన్నారు కింజారపు అచ్చెన్నాయుడు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతులకు రాయితీపై వ్యవసాయ యాంత్రికరణ పరికరాలను అందజేశారు. మహిళలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూత నిచ్చేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు. అందులో భాగంగానే స్వయం సహకార సంఘాలకు జీవనోపాధి కోసం బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి ద్వారా రుణం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రూ.49,75,00,000 చెక్కును లబ్ధిదారులకు మంత్రివర్యులు అందజేశారు.
Also Read : CM Chandrababu Innovative : ఏపీకి రామ్ దేవ్ బాబా అడ్వైజర్ గా ఉండాలి















