Kishan Reddy : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహకరించడం లేదని చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కండగా ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “అభివృద్ధి అంటే ఏంటో ప్రధాని మోదీని చూసి నేర్చుకోండి” అని వ్యాఖ్యానించారు.
Kishan Reddy – “రేవంత్ రెడ్డి సిద్ధమేనా?”
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏం చేసింది అనే విషయంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. “మరి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా?” అంటూ ఆయన సవాల్ విసిరారు. “రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరికాదు. మీ క్యాబినెట్ సహచరులు కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు” అంటూ ఆయన మండిపడ్డారు.
పసుపు బోర్డు – కేంద్రం పాలుపంచిన నూతన పథకాలు
నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును ఉదహరిస్తూ, అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమేనని తెలిపారు. “మేము తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు” అని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించారని, ప్రస్తుతం కేంద్రం అది పరిశీలిస్తున్నదని వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆదివారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నట్టు చెప్పారు. సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్ల నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు వివరించారు.
రాష్ట్ర అభివృద్ధి అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించిన కిషన్ రెడ్డి, కేంద్రం నిరంతరం తెలంగాణకు నిధులు, పథకాలు, అభివృద్ధి పనులు అందిస్తున్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహనతో మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
Also Read : Naveen Patnaik Shocking Comments : పూరి రథయాత్ర దుర్ఘటనపై మాజీ ఘాటు విమర్శలు















