Nara Lokesh : అమరావతి – ప్రజలు మనందరిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). ఈసారి జరిగిన కూటమి ఎన్నికల్లో కార్యకర్తల శ్రమ దాగి ఉందన్నారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. వారు లేక పోతే పార్టీ మనుగడ సాగించడం కష్టమన్నారు. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని అన్నారు నారా లోకేష్.
Nara Lokesh Comments
ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు మంత్రి. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారం తప్పా మరోటి కాదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం అమలు చేయడం జరిగిందన్నారు. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు నారా లోకేష్.
దేశం మొత్తం తిరిగినా, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది మనం పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికేనని పేర్కొన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే పట్టించుకోని పరిస్థితి ఆనాటి పాలనలో చూసామన్నారు. కష్టపడిన కార్యకర్తలను మరువద్దని మిమ్మల్నందరినీ కోరుతున్నానని పేర్కొన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. మనం ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు నారా లోకేష్.
Also Read : Minister Pralhad Joshi Shocking : కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
