Pralhad Joshi : 1975లో విధించిన అత్యవసర పరిస్థితి తరువాత రాజ్యాంగంలో చేసిన 42వ సవరణపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 32 ప్రాథమిక నిబంధనల్లో మార్పులు చేశారని తెలిపారు. దీనివల్ల భారత రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్” (సమాజవాదం), “లౌకిక” (సెక్యులర్) అనే పదాలను చేర్చినట్టు పేర్కొన్నారు.
Pralhad Joshi Shocking Comments
తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) మాట్లాడుతూ – “రాజ్యాంగానికి అసలు రూపం ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పదాలను ప్రవేశికలో చేర్చడానికి విభేదించారు. కానీ అత్యవసర పరిస్థితి సమయంలో వాటిని బలవంతంగా చేర్చారు. ఇవి అంబేద్కర్ భావనలకు విరుద్ధం” అని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, 1975లో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల హక్కులను కాలరాసిందని ఆయన ఆరోపించారు. “అత్యవసర పరిస్థితిలో పత్రికా స్వేచ్ఛను అణిచివేసారు, లక్షల మందిని జైలుకు పంపారు. ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనం” అని విమర్శించారు.
ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన అత్యవసర పరిస్థితి 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కూడా మాట్లాడారు. “రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ‘సోషలిస్ట్’, ‘లౌకిక’ పదాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలంటే, రాజ్యాంగాన్ని అసలు ఉద్దేశంతో చూసుకోవాలన్నది ఈ వ్యాఖ్యల సారాంశంగా నిలిచింది.
Also Read : Jeff Bezos Shocking Expenses : అమెజాన్ వ్యవస్థాపకుడు పెళ్లి దుస్తులకు 12 కోట్లు ఖర్చుపెట్టారా?















