Raja Singh : హైదరాబాద్ – బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే హైకమాండ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పలువురు సీనియర్ నేతలు అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా ఈ పదవి కోసం రేసులో ఎంపీ ఈటల రాజేందర్, బండి సంజయ్ , రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డి, డీకే అరుణ , తదితరులు పోటీ పడ్డారు.
MLA Raja Singh Shocking Comments
సోమవారం ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) మీడియాతో మాట్లాడారు. తనను గనుక అధ్యక్షుడిగా ఎన్నుకుంటే , పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేస్తామన్నారు. ఒక్కసారి తనకు పని చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరాడు. తాను ముందు నుంచి హిందూత్వ వాదిగా ఉన్నానని పేర్కొన్నారు.
తనను చాలామంది కార్యకర్తలు కోరుకుంటున్నారని అన్నారు. గోరక్షణ విభాగం ఏర్పాటు చేసి, గోరక్షకులకు అండగా నిలుస్తానని చెప్పారు ఎమ్మెల్యే రాజా సింగ్. తెలంగాణను యూపీగా మారుస్తానని అన్నారు. ఏది ఏమైనా తాను పార్టీ కోసం ప్రాణాలు అర్పించేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు.
Also Read : హౌసింగ్ బోర్డు ఆస్తుల వేలానికి సిద్ధం
