Basavaraju Sariah : వరంగల్ జిల్లా – కొండా మురళిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య (Basavaraju Sariah). క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. షో కాస్ నోటీస్ ఇస్తే వెళ్ళి, నన్ను ఎవరూ పిలవలేదు అంటున్నారని పేర్కొన్నారు. క్రమశిక్షణ సంఘంపై కూడా కొండా ఫ్యామిలీకి విశ్వాసం లేదన్నారు. పార్టీలు మారలేదు అని చెప్పిన కొండా కుటుంబం అన్ని పార్టీలు మారారని అన్నారు.
MLC Basavaraju Sariah Sensational Comments
38 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని బతికించాను అని చెప్పారడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు కొండా మురళికి రాజకీయ జన్మ ఇచ్చింది టీడీపీ పార్టీ అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చరిత్ర కొండా కుటుంబానిదని అన్నారు. కులాన్ని అడ్డు పెట్టుకుని కొండా మురళి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖగా మారింది. పలువురు ఎమ్మెల్యేలు ఒక్కటై మంత్రి భర్త కొండా మురళికి వ్యతిరేకంగా గ్రూప్ గా ఏర్పడడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రత్యేకించి ఈ మధ్యన కొండా దంపతుల ఆగడాలు ఎక్కువై పోయాయని, వారిని తట్టుకోవడం కష్టంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీనిపై క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ మల్లురవిని ఏమిటో తెలుసు కోవాలని ఆదేశించింది.
Also Read : Amit Shah Sensational Comments : 2026 లోపు నక్సలిజం లేకుండా చేస్తాం















