MLC Kavitha Shocking : క‌విత బీసీల జ‌పం స‌ర్కార్ పై యుద్ధం

42 శాతం రిజ‌ర్వేష‌న్ల కోసం రైల్ రోకో

Hello Telugu - MLC Kavitha Shocking

Hello Telugu - MLC Kavitha Shocking

MLC Kavitha : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆమె బీసీల కోసం త‌న వాయిస్ ను వినిపించేందుకు రెడీ అయ్యారు. ఈ మేర‌కు దూకుడు పెంచారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం బీసీల‌ను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. క‌రీంన‌గ‌ర్ డిక్లరేష‌న్ లో భాగంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం కచ్చితంగా 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. లేక పోతే యుద్దం త‌ప్ప‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు.

MLC Kavitha Shocking Demand

రిజ‌ర్వేష‌న్ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోకి వెళ్లాల‌ని ఆమె అన్నారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం క‌ల్వ‌కుంట్ల క‌విత (MLC Kavitha) మీడియాతో మాట్లాడారు. బీసీల‌కు సామాజిక న్యాయం చేసేందుకు గాను వ‌చ్చే నెల జూలై 17న రైల్ రోకో చేప‌ట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా క‌విత‌కు వామ‌ప‌క్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ , త‌దిత‌ర పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ కోటాపై పెద్ద ఎత్తున ఆందోళన చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.

తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (UPF), ఇతర బీసీ సంస్థలు గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీలో 42 శాతం బీసీ కోటా కోరుతూ బిల్లును ఆమోదించినప్పటికీ, రాష్ట్రపతి ఆమోదం పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని క‌ల్వ‌కుంట్ల క‌విత‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పలుసార్లు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ అంశాన్ని లేవనెత్తలేదని ఆమె విమర్శించారు.

Also Read : CM Revanth Reddy Challenge :సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ కు హ‌రీశ్ రావు సై

Exit mobile version