AV Ranganath : హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) కీలక ప్రకటన చేశారు. వర్షాకాలం కావడంతో హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్నారు. 150 మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లను రంగంలోకి దించిందన్నారు. ఒక్కో షిఫ్టులో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో పని చేస్తారని తెలిపారు. ఇలా 150 మాన్సూన్ ఎమర్జన్సీ బృందాల్లో మొత్తం 1800ల మంది ఉంటారని పేర్కొన్నారు. ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.
AV Ranganath Shocking Comments
వర్షపు నీరు నిలిచే (368 స్టాటిక్ టీమ్‌లు) చోట రెండు షిఫ్టుల్లో పని చేసేలా 734 మంది సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. వీరికి తోడు హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు 51 వర్షాకాలం పనుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. ఒక్కో టీమ్‌లో 18 మంది ఉంటారని, ఇలా డీఆర్ ఎఫ్ సిబ్బంది 918 మంది సేవలందిస్తారని చెప్పారు. వీరు ఒక్కో షిఫ్టుల్లో ఆరుగురు చొప్పున పని చేస్తారని చెప్పారు. వీరికి తోడు ఎమర్జన్సీ బైకు బృందాలు 21 ఉన్నాయని అన్నారు. ఒక్కో బైకుపైన ఇద్దరు చొప్పున మొత్తం 42 మంది పని చేస్తారని స్పష్టం చేశారు.
30 సర్కిళ్లలో పనులను పర్యవేక్షించేందుకు హైడ్రాకు చెందిన మార్షల్స్ 30 మంది ఉంటారని అన్నారు.. ట్రాఫిక్ పోలీసులతో కలసి పని చేసేందుకు రెండు షిప్టుల్లో కలిపి 200ల మందితో 20 బృందాలు, చెట్టుకొమ్మలు, చెత్తను ఎత్తుకెళ్లేందుకు వీలుగా.. ఒక్కో షిప్టులో ముగ్గురు చొప్పున ఉండేలా 240 మంది అందుబాటులో ఉంటారని ఏవీ రంగనాథ్ చెప్పారు. ఇలా అధికారులతో కలిపి వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు మొత్తం 4100 మంది సేవలందిస్తారని వెల్లడించారు.
వర్షం ఎప్పుడు వస్తుందో ఎంత మొత్తంలో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ (ఎంఈటీ)లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు.
Also Read : CM Revanth Shocking Comments : నీళ్ల వాటా విషయంలో రాజీ పడేది లేదు – సీఎం















