Mysaa : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన చిత్రం మైసా (Mysaa). ఈ సినిమాకు సంబంధించి మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఎవరూ ఊహించని విధంగా మాయ చేసేలా, భయ పెట్టేలా ఉంది ఈ పోస్టర్.
దీనిని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మించింది. హీరోయిన్ ఓరియంటెడ్ గా దీనిని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ప్రముఖ దర్శకుడు హన రాఘవపూడి శిష్యుడైన రవీంద్ర పుల్లే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అజయ్, అనిల్ సయ్యపు రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. పాన్ ఇండియా స్థాయిలో దీనిని చిత్రీకరిస్తున్నారు.
Rashmika Mandanna – Mysaa Movie Poster Viral
ఇక దేశ వ్యాప్తంగా టాప్ హీరోయిన్ గా ఇప్పటికే పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఈ ఏడాది మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ఒకటి ఆశించిన మేర ఆడలేదు. కానీ రెండు మూవీస్ మాత్రం దుమ్ము రేపాయి. వాటిలో ఒకటి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు జీవిత గాథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఛావా. ఇది రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన మూవీ సికిందర్ లో సల్మాన్ ఖాన్ తో నటించింది. కానీ వర్కవుట్ కాలేదు.
అంతకు ముందు తను నటించిన రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఒకటి పుష్ప 2 కాగా రెండోది వంగా తీసిన యానిమల్. ఒకటి 1867 కోట్లు వసూలు చేస్తే ఇంకోటి 1000 కోట్లు రాబట్టింది. తాజాగా తను కీ రోల్ పోషించిన చిత్రం శేఖర్ కమ్ముల తీసిన కుబేర మూవీ. ఇది సూపర్ టాక్ తో ముందుకు వెళుతోంది. ప్రస్తుతం మైసాలో నటిస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : కన్నప్ప సూపర్ మంచు విష్ణు అదుర్స్















