Nara Lokesh Invite New : చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం

విద్యావంతుల పాలకత్వం వలనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు...

Hello Telugu - Nara Lokesh Invite New

Hello Telugu - Nara Lokesh Invite New

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యా మరియు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మంచి చదువున్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. విద్యావంతుల పాలకత్వం వలనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

Nara Lokesh Invites

ఈరోజు (సోమవారం) బాపట్ల జిల్లాలో నారా లోకేష్ (Nara Lokesh) పర్యటించారు. ఇంకొల్లు వద్ద డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గురువులు దేవుడితో సమానం అని చెప్పారు. గురువులను, తల్లులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అని అన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో భారత పర్యాటకులను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు అన్యాయంగా హత్య చేశారన్న విషయం తనను తీవ్రంగా బాధించింది అని తెలిపారు. ఈ ఘటనకు గుణపాఠంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.

సైనికులను గౌరవించడమూ, వారి కోసం మనవంతు చేయడమూ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు కానీ, అవి అధిగమించేందుకు శక్తిని కూడా ఇస్తాడు అని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ 20 ఏళ్లుగా మంగళగిరిలో గెలవలేకపోయిందని, తానూ మొదటిసారి అక్కడే పోటీ చేసి ఓడిపోయానని గుర్తుచేశారు. ఐదేళ్లు కష్టపడి తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిచానని, ఓటమి తరువాత తనను అనేక మంది హేళన చేశారని తెలిపారు. కానీ తాను అసహనం చెందకుండా విజయాన్ని సాధించానని, అందరూ నిరుత్సాహపడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని హితవు పలికారు.

Also Read : MP Arvind Shocking Comments : బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై భగ్గుమన్న బీజేపీ ఎంపీ అరవింద్

Exit mobile version