Nithin Reddy : నితిన్ రెడ్డి కీ రోల్ పోషించిన చిత్రం తమ్ముడు. ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. – ఏ- సర్టిఫికెట్ ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) . ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. దీనిని పూర్తిగా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించింది దీనిని రిచ్ గా. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటుడు నితిన్ (Nithin Reddy) కూడా ఈ చిత్రానికి ఎ రేటింగ్ ఇచ్చిందని ధ్రువీకరించాడు.
Hero Nithin Reddy Tammaudu Movie Release Updates
ఈ ఏడాది తను లవ్లీ బ్యూటీ శ్రీలీలతో కలిసి నటించిన రాబిన్ హుడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది బొక్క బోర్లా పడింది. ఊహించని దెబ్బ పడింది. దీంతో నిర్మాతలు పెద్ద ఎత్తున ఖర్చు చేసినా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్, కావాల్సిన మసాలా ఇవ్వలేక పోయాడన్న అపవాదు ఎదుర్కొన్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ప్రస్తుతం నితిన్ రెడ్డి తాజాగా తను నటించిన తమ్ముడు మూవీపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు.
ఇంకో వైపు తమ్ముడు మూవీలో ఒకప్పుడు నటిగా పేరు పొందిన లయ ఉన్నట్టుండి చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ చిత్రంలో కీ రోల్ పోషించింది. తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇందులో ఝాన్సీ కిరణ్మయి పాత్రను చేసింది. ఇక టీజర్ కు భారీ స్పందన వచ్చింది. ఇందులో శిక్షణ పొందిన విలుకాడిగా నితిన్ నటిస్తుండగా సోదరిగా లయ నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో ఓ ట్యాగ్ లైన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. నువ్వు మాట నిలబెట్టుకోలేక పోతే నువ్వు బతికి ఉన్నా చచ్చినట్టేనని.
Also Read : Kannappa – RGV Interesting : కన్నప్ప మాస్టర్ క్లాస్ – రామ్ గోపాల్ వర్మ















