Pashamylaram : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని (Pashamylaram) సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన కావడం గమనార్హం. మరో 33 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 20 మంది ఇప్పటి వరకు జాడ లేదు. దీంతో మరింత మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Pashamylaram Incident Updates
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో కేవలం కొందరిని మాత్రమే గుర్తించారు. ఇంకా చని పోయిన వారు ఎవరనే దానిపై గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చని పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ప్రకటించారు. మరో వైపు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
నిన్నటి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో డెడ్ బాడీస్ ను గుర్తించేందుకు వీలు కుదరడం లేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నం అయ్యారు. సిగాచి ఇండస్ట్రీస్ ప్రాంగణం అంతా విషాద వాతావరణం అలుముకుంది. సంఘటనకు గల కారణాలు ఏమిటనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో ప్లాంట్ మేనేజర్ గోవర్దన్ కూడా మృతి చెందారు.
Also Read : AP Liquor Scam Sensational : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన అప్డేట్
