Hari Hara Veera Mallu : ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం నిర్మాణ సారథ్యంలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ కీ రోల్స్ పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకు అద్శుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేశాయి.
Hari Hara Veera Mallu Movie Poster Viral
అయితే రాజకీయాలలో బిజీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కొంత సమయం కేటాయించ లేక పోయారు ఈ సినిమా కోసం. తను ప్రస్తుతం కేబినెట్ లో ఉండడంతో ఇటీవలే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. హరి హర వీరమల్లుతో పాటు ఓజీ మూవీలో నటించాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి. ఇదే సమయంలో ప్రేక్షకుల ముందుకు హరి హర వీరమల్లు రానుంది. తేదీ కూడా డిక్లేర్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.
ట్రైలర్ , దాని విజువల్స్ , యాక్షన్ , కొరియోగ్రఫీ , భావోద్వేగాలను అద్భుతంగా తెర మీద పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు జ్యోతికృష్ణ. ఈ సినిమాకు సంగీతం అందించారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి. ఈ ట్రైలర్ పూర్తిగా 30 సెకన్లుగా ఉంది. ఇందులో పవన్ కు ధీటుగా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషించాడు. ఆకట్టుకునే సంభాషణలు చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.
Also Read : Hero NTR – War 2 : వార్ 2 తెలుగు హక్కులు నాగ వంశీ స్వంతం















