BV Pattabhiram : హైదరాబాద్ – ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (BV Pattabhiram) మంగళవారం హైదరాబాద్ లో గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఇంద్రజాలికుడిగా, మానసిక వైద్యుడిగా, హిప్నాటిస్ట్ గా, రచయితగా, వక్తగా పేరు పొందారు. వేలాది మందిని ప్రభావితం చేశారు. ఎంతో మందికి స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేశారు. భార్య, కొడుకు ఉన్నారు.
BV Pattabhiram No More
బీవీ పట్టాభిరామ్ స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా. ఆయన పూర్తి పేరు భావరాజు వేంకట పట్టాభిరామ్. తెలుగు, ఆంగ్లం, కన్నడ, తమిళ భాషల్లో పలు అంశాలపై రచనలు చేశారు. ప్రత్యేకంగా ఆయన స్టూడెంట్స్ కోసం ట్రైనింగ్స్ నిర్వహించారు. అంతే కాకుండా పిల్లల పేరెంట్స్ లో కూడా అవగాహన కల్పించేందుకు సైతం కృషి చేశారు. దూర దర్శన్ లో మేజిక్ షోలు కూడా నిర్వహిస్తూ వచ్చారు. పలు పత్రికలలో కూడా చిన్నారులలో మానసిక వికాసం కలిగించేలా రచనలు చేశారు. పలు పత్రికలలో తన పేరుతో చిరపరిచితం అయ్యారు. బాలజ్యోతి పత్రికలో మాయా విజ్ఞానం అనే పేరుతో కూడా రాసే ప్రయత్నం చేశారు బీవీ పట్టాభిరామ్.
ఆయన ఓయు నుంచి డాక్టరేట్ పొందారు. మనస్తత్వ శాస్త్రం, తత్వ శాస్త్రం, పరిపాలనా శాస్త్రం లో పట్టాలు అందుకున్నారు. గైడెన్స్, కౌన్సెలింగ్ , జర్నలిజంలో కూడా కోర్సు చేశారు. పలు అంశాలపై కౌన్సెలింగ్ చేపట్టారు. వేలాది మందికి ఊరటను ఇచ్చే ప్రయత్నం చేశారు. బీవీ పట్టాభిరామ్ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్ లాండ్ , సింగపూర్ , అరబ్ దేశాల్లో వర్క్ షాప్ లు చేపట్టారు. చైతన్యవంతం చేసేందుకు కృషి చేశారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.
Also Read : Sleeping Problems : మీకు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..అయితే ఈ టీ తాగండి















