Purnachandar – Pocso Case Sensational : పూర్ణ చంద్ర నాయ‌క్ పై ఫోక్సో కేసు

సంచ‌ల‌నం సృష్టించిన స్వేచ్ఛ సూసైడ్

Hello Telugu - Purnachandar - Pocso Case Sensational

Hello Telugu - Purnachandar - Pocso Case Sensational

Purnachandar : హైద‌రాబాద్ – టీ న్యూస్ ఛాన‌ల్ స్పెష‌ల్ క‌రెస్పాండెంట్ స్వేచ్ఛ ఓట్క‌ర్ సూసైడ్ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి పూర్ణ చంద్ర నాయ‌క్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయ‌మూర్తి ముందు హాజ‌రు ప‌ర్చ‌గా 14 రోజుల రిమాండ్ విధించారు. త‌న‌పై బీఎన్ఎస్ యాక్ట్ 69, 108 చ‌ట్టంతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసు న‌మోదు చేసిన‌ట్లు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు వెల్ల‌డించారు. విచార‌ణ అనంత‌రం వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. తన వాంగ్మూలంలో పూర్ణ (Purnachandar) పేర్కొన్న అంశాలపై రకరకాల ప్రచారం సాగుతోంది.

Journalist Swetcha Case Purnachandar Nayak..

ఇదిలా ఉండ‌గా స్వేచ్ఛ ఓట్క‌ర్ తెలంగాణ ప్రాంతంలో అత్యంత పేరు పొందిన జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు. త‌న స్వ‌త‌హాగా క‌వ‌యిత్రి, ర‌చ‌యిత్రి, అన‌లిస్ట్ , వ‌క్త కూడా. వివిధ సామాజిక అంశాల‌పై ఎన్నో వ్యాసాలు రాశారు. త‌న‌దైన శైలిలో ఈ ప్రాంతం గురించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఉస్మానియా యూనివ‌ర్శిటీలో చ‌దువుకున్న స్వేచ్ఛ ఓట్క‌ర్ తండ్రి తెలంగాణ శంక‌ర్ ఉద్య‌మ కాలంలో ముందుండి న‌డిపించారు.

స‌హ‌చ‌ర పేరుతో బుక్ ప‌బ్లిషింగ్ హౌస్ ను న‌డిపించారు. ఇక స్వేచ్ఛ‌కు గ‌తంలో పెళ్ల‌యింది. భ‌ర్త‌తో విడాకులు పొందింది. ఆ త‌ర్వాత ఎలాగో త‌న‌ను బుట్ట‌లో ప‌డేశాడు పూర్ణ చంద‌ర్ నాయ‌క్. ఇటీవ‌లే ఇద్ద‌రూ తిరువ‌ణ్ణామ‌లైకి వెళ్లి వ‌చ్చారు. ఏమైందో ఏమో కానీ త‌న ఇంట్లో సూసైడ్ చేసుకుని ఉండ‌డం ప‌క్క‌న ఉన్న వాళ్లు గుర్తించారు. త‌న కూతురి చావుకు నాయ‌క్ కార‌ణ‌మ‌ని ఆరోపించారు పేరెంట్స్.

Also Read : CM Chandrababu Warning : ఎమ్మెల్యేలు గైర్హాజ‌ర్ చంద్రబాబు న‌జ‌ర్

Exit mobile version