Swetcha : హైదరాబాద్ – తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, టీ న్యూస్ ఛానల్ స్పెషల్ కరెస్పాండెంట్ స్వేచ్ఛ నిన్న తన నివాసంలో సూసైడ్ చేసుకుంది. ఈ సందర్బంగా తన తండ్రి తెలంగాణ శంకర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు సూసైడ్ చేసుకోలేదని వాపోయాడు. పూర్ణ చందర్ రావు అనే వ్యక్తి కారణమని పేర్కొన్నాడు. తను భర్తతో విడిపోయాక స్వేచ్ఛ (Swetcha) పూర్ణచంద్రరావుతో ఉంటోందన్నారు. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య విబేధాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Journalist Swetcha Death Shocking
పూర్ణతో కలిసి ఉండలేను నాన్న అని తనకి జూన్ 26న ఫోన్ చేసిందని చెప్పారు తండ్రి. ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జర్నలిస్టులు పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. తనది సూసైడ్ కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
స్వేచ్ఛ అనేది పిరికితనం కాదని, అది ఒక ఉద్యమ జర్నలిస్ట్ అని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న తల్లిదండ్రులు, విప్లవాత్మక నేపథ్యం నుండి వచ్చి జర్నలిస్ట్‌గా పెరిగిన తెలంగాణ బిడ్డ అని తెలిపారు. తను సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ ల తరపున గొంతుక గా మారిందన్నారు. అంతే కాదు కవయిత్రి కూడా అని తెలిపారు. ఆమె మరణం సహజ మరణం కాదన్నారు. .
నిన్న శంకరన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు, పూర్ణచంద్రరావు ఆమె హత్యకు కారణమని ఆరోపించాడన్నారు. తనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛ మృతికి సంతాపం తెలిపింది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్. ఇది అకాల మరణం అంటూ నివాళి అర్పించింది. పూర్ణ చందర్ రావును అరెస్ట్ చేసేంత వరకు వదల కూడాదన్నారు.
Also Read : YS Sharmila Shocking Comments : అన్నదాత సుఖీభవ కాదు అన్నదాత దుఖీభవ















