Puri Jagannath Darshan : హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 వద్ద ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయం కళింగ సంస్కృతి ప్రతిబింబంగా తళుక్కుమంటోంది. పూరిలోని జగన్నాథ (Puri Jagannath Darshan) ఆలయానికి తగ్గదే తానని చెప్పే ఈ పవిత్ర స్థలం, భక్తుల మనస్సుల్లో భక్తి భావాలను రేకెత్తిస్తుంది. పూరి వెళ్లలేనివారికి ఇది గొప్ప ప్రత్యామ్నాయ క్షేత్రంగా నిలుస్తోంది.
Puri Jagannath Darshan Updates
కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న ఈ ఆలయం నిర్మాణానికి కళింగ కల్చరల్ ట్రస్ట్ ముందు వరుసగా పూనుకుంది. ఒడిశా నుంచి 1992లో హైదరాబాద్‌కు వలస వచ్చిన ఒడియా సంఘం ఈ ఆలయ నిర్మాణ ఆలోచనకు బీజం వేసింది. అప్పటినుంచి హోమాలు, యజ్ఞాలు, పూజలు, కీర్తనలు నిర్వహించబడినా ఆలయ నిర్మాణం కొనసాగలేదు.
ఇదే సమయంలో 2004లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. శిల్పకళలో నిపుణులైన చేతివృత్తులవారు స్వయంగా ముందుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తరం నుండి ఆలయ నిర్మాణం వేగంగా కొనసాగింది. దాదాపు 100 మంది అంకితభావంతో పనిచేసిన కార్మికులు ఐదేళ్ల పాటు శ్రమించి, మార్చి 2009లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఆలయ ప్రాంగణంలో జగన్నాథ స్వామితో పాటు గణపతి, ఆంజనేయుడు, లక్ష్మీదేవి, విమలాదేవి, శివుడు, నవగ్రహాల మూర్తులు ప్రతిష్టించబడ్డాయి. ఆలయ ప్రహరీపై పూరాణిక చిత్రాలు, దశావతారాల వివరణలు, దేవతల విశేషాలు ప్రతిబింబించే కళా సృష్టి ఆకట్టుకుంటుంది.
ప్రత్యేకంగా ఆలయ లైటింగ్ రాత్రివేళల్లో ఆ ఆలయాన్ని మరింత వైభవంగా, ఆధ్యాత్మికంగా మెరిసేలా చేస్తోంది. కళా ప్రదర్శన, భక్తి పరిపూరణ, ఆధ్యాత్మిక వైభవం సమ్మిళితంగా ఈ ఆలయం హైదరాబాద్‌లోని ప్రత్యేక హిందూ క్షేత్రంగా నిలిచింది.
Also Read : TTD Interesting News :శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్















