Coolie : కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫుల్ ఫోకస్ పెట్టాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీపై. ఇప్పుడు అందరి కళ్లు ఈ మూవీపైనే ఉన్నాయి. అన్ని హంగులతో కష్టపడి తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తను గతంలో దళపతి విజయ్ తో లియో తీశాడు. అంతకు ముందు మాళవిక మోహన్ , విజయ్ తో కలిసి మాస్టర్ తీశాడు. తన ప్రతిభను గుర్తించిన దళపతి మరోసారి సినిమా చేయాలని ఉందని ప్రకటించాడు. కానీ తను సంచలన ప్రకటన చేశాడు. ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించాడు.
Coolie Movie Sensational
ఇక కూలీ (Coolie) చిత్రాన్ని సన్ పిక్చర్స్ యాజమాన్యం నిర్మిస్తోంది. ఇప్పటికే అంచనాలు పెరిగాయి. కూలీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ దుమ్ము రేపుతున్నాయి. ప్రధానంగా రజనీకాంత్ తన మేనరిజం హై లెవల్లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు లోకేష్ కనగరాజ్. దీంతో సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతున్నాడు. కూలీ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు నటులు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, సౌబీర్ షబీన్, కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతీ హాసన్ నటించారు.
కూలీ చిత్రంలో ప్రధాన ఆకర్షణ కానుంది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తనతో స్పెషల్ సాంగ్ చేయించాడు లోకేష్ కనగరాజ్. తను తీసే ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో కూలీకి తిరుగులేదని అంటున్నారు సినీ వర్గాలు. ఇక జైలర్ మూవీతో దుమ్ము రేపిన రజనీకాంత్ ఏజ్ పెరిగినా డోంట్ కేర్ అంటూ ముందుకు దూసుకు పోతున్నాడు. తనకు ఎదురే లేదని చాటుతున్నాడు. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది ఈ మూవీ గురించి. కూలీ పేరుతో అన్ని భాషల్లో విడుదల చేస్తుండగా బాలీవుడ్ లో మాత్రం మజ్దూర్ గా వస్తోందని తెలిపాడు దర్శకుడు.
Also Read : Beauty Rashmika Mandanna :అందరి కళ్లు నేషనల్ క్రష్ పైనే















