Ramchandra Rao : హైదరాబాద్ – బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది ఎన్. రామచందర్ రావుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. గత కొంత కాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో నిన్న పార్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పలువురు నామినేషన్లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరుణంలో ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బండి సంజయ్ , కాటేపల్లి వెంకట రమణా రెడ్డి, తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.
Ramchandra Rao As a Telangana BJP Chief
ఇదిలా ఉండగా తను అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఢిల్లీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రామచందర్ రావు (Ramchandra Rao), బాబుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బాబు మద్దతుతో నడుస్తోంది. దీంతో తను ఏది చెబితే అది అవుతోంది. ఇదిలా ఉండగా బీజేపీ పార్టీ చీఫ్ పదవి కోసం చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు ఈటల రాజేందర్. కానీ తను పార్టీ చీఫ్ కాకుండా బీజేపీ నేతలు అడ్డు పడినట్లు టాక్.
ఇదిలా ఉండగా సోమవారం పార్టీ హైకమాండ్ నుంచి రామచందర్ రావుకు ఫోన్ వచ్చింది. వెంటనే నామినేషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో తన ఎన్నిక దాదాపు ఖరారైనట్టేనని చెప్పక తప్పదు. బీజేపీలో ఇంకొకరి ప్రమేయం ఉండదు. అమిత్ షా ఫైనల్ చేస్తే ఇక ఎవరూ అడ్డు చెప్పరు.
Also Read : బీజేపీ ప్రెసిడెంట్ చేస్తే యోగి లాగా పని చేస్తా















